- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన వ్యక్తిగత హక్కులకు (పర్సనాలిటీ రైట్స్) రక్షణ కల్పిస్తూ న్యాయస్థానం కీలక మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. కృత్రిమ మేధ (ఏఐ), డీప్‌ఫేక్ టెక్నాలజీలను ఉపయోగించి తన పేరు, స్వరం, ఫొటోలను అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాలకు వాడుకోవడాన్ని సవాల్ చేస్తూ నాగార్జున ఈ పిటిషన్ దాఖలు చేశారు.
- Advertisement -