Sunday, May 11, 2025
Homeజాతీయంజాతీయ రక్షణ నిధికి అసెంబ్లీ స్పీకర్‌ నెల జీతం విరాళం

జాతీయ రక్షణ నిధికి అసెంబ్లీ స్పీకర్‌ నెల జీతం విరాళం

- Advertisement -

నవతెలంగాణ – అమరావతి : దేశ రక్షణ కోసం పోరాడుతున్న వీరజవాన్లకు సంఘీభావంగా తన ఒక నెల వేతనం జాతీయ రక్షణ నిధికు విరాళంగా ఇస్తున్నట్లు ఎపి అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల.అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … ఉగ్రవాద నిర్మూలనలో భారత సాయుధ దళాలు ప్రదర్శిస్తున్న ధైర్యసాహసాలు దేశ ప్రజలందరికీ గర్వకారణంగా నిలుస్తున్నాయని అన్నారు. భారతదేశం సాయుధ దళాలు చేస్తున్న ధైర్యసాహసాలు ప్రతి భారతీయునిలో గర్వాన్ని కలిగిస్తున్నాయని తెలిపారు. దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న వీర జవాన్లకు సంఘీభావం తెలిపారు. తన నెల జీతాన్ని జాతీయ రక్షణ నిధికి విరాళంగా ఇచ్చినట్లు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. ఈ మేరకు తన నెల జీతం రూ.2,17,000లను ఆన్‌ లైన్‌ ద్వారా జాతీయ రక్షణ నిధికి ట్రాన్స్‌ఫర్‌ చేసినట్లు.. రిసిప్ట్‌ను కూడా ఆయన విడుదల చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -