- Advertisement -
నవతెలంగాణ కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా ప్రజలందరికి విజయ దశమి పండుగ సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ తరఫున పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శుభాకాంక్షలు తెలియజేశారు. దుష్ట శక్తులపై విజయానికి సంకేతముగా జరుపుకునే ఈ వండుగను స్పూర్తిగా తీసుకొని ప్రజలందరు ఐక్యత, సమగ్రతల కోసం కృషి చేయాలన్నారు. ఈ ఏడాది వారి వారి కుటుంబ సభ్యులతో నిండు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషములతో కాలం గడపాలని కోరారు.
నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలలో శాంతి భద్రతలకు, మత విధ్వంసాలకు తావు ఇవ్వకుండా అందరు సహకరించాలన్నారు. ఎల్లప్పుడు ప్రజలు పోలీస్ సిబ్బంది స్నేహ పూర్వకంగా సోదర స్వభావముతో మెలగాలన్నారు.
- Advertisement -