నవతెలంగాణ సదాశివనగర్
సదాశివ నగర్ మండల నూతన కార్యవర్గాన్ని మండల తాహశీల్దార్ కార్యాలయం దగ్గర బుధవారం ఎన్నుకున్నారు. గ్రామ పాలన ఆఫీసర్లుగా సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడిగా గ్యార సాయిలు (యాచారం) ఉపాధ్యక్షులుగా కారంపూరీ శ్రీనివాస్ (సదాశివ్ నగర్) ప్రధాన కార్యదర్శిగా సంఘీ స్వామి (భూంపల్లి) సంయుక్త కార్యదర్శిగా మన్నే మౌనిక (కుప్రియల్) కోశాధికారిగా ముదాం శ్రీకాంత్ (మర్కల్) తోపాటు సలహాదారులుగా కెంగార్ల నవీన్ (జనగామ) దేవర బోయిన బాలకృష్ణ (అడ్లూరు ఎల్లారెడ్డి) కుంట రాజేశ్వర్ (ఉత్నూర్) లను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా జిపిఓ అధ్యక్షులు గ్యార సాయిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిపిఓలను నియమించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామాల్లోని అన్ని వర్గాల ప్రజలకు జిపిఓలు అందుబాటులో ఉండి సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు బాధ్యతయుతంగా పని చేస్తామన్నారు. అదేవిధంగా జిపిఓల సమస్యలపై హక్కుల కోసం నిరంతరంగా పోరాడుదాం అన్నారు ఈ కార్యక్రమాల్లో ఈసీ మెంబర్లు అస్కె అనిల్ కుమార్ (అమర్లబండ) బొండ్ల రమేష్ (వజ్జపల్లి)ఆకారం బాబు (ధర్మారావుపేట) రవి (కలవరాళ్ళ) ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామా జీపీవోలు పాల్గొన్నారు.