Wednesday, October 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దుర్గామాత మండపాలను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

దుర్గామాత మండపాలను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్

జుక్కల్ మండలంలోని పెద్ద గుల్ల, పెద్ద ఏద్గి గ్రామం లోనీ నవరాత్రుల సందర్బంగా దుర్గ భవాని మాత మండపాలను జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ అది శక్తి అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై, పాడి పంటల చల్లని చూపు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా జగదాంబ భవాని నీ ప్రార్థిచానని తెలిపారు. ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు నిర్వహించామని తెలిపారు.

మేము దసరా నవరాత్రుల ఉత్సవాలలో అమ్మవారి మండపాలను దర్శించుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. భగవంతుని ఆశీస్సులు ఉంటే రైతులకు మంచి పంటలు పండి గిట్టుబాటు ధర లభించాలని రైతుల ఇండ్లలో లక్ష్మీ ఆశీర్వాదంతో సిరిసంపదలు కలగాలని కోరుకుని ప్రార్థించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం లో జుక్కల్ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -