- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక
యువత క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలని తాజా మాజీ ఉపసర్పంచ్ పర్స దేవరాజు ముదిరాజ్ అన్నారు
బుధవారం దుబ్బాక మండలం అచ్చుమాయిపల్లి లో మిత్ర సేన యూత్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించిన కబడ్డీ పోటీలకు ఆయన హాజరై క్రీడాకారులని ప్రోత్సహించేందుకుగాను ఆర్థిక సహకారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుత రోజుల్లో చాలామంది యువత ఎలాంటి శారీరక శ్రమ పడకుండా ఉండడం వల్ల అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన ఆరోగ్యకరంగా ఉండేందుకు నిత్యం వ్యాయామం వీలు కుదిరినప్పుడల్లా క్రీడలు ఆడాలని సూచించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు బహుమతులు అందజేశారు.
- Advertisement -