Wednesday, October 1, 2025
E-PAPER
Homeక్రైమ్అధిక లాభం ఆశ  చూపి కోట్లల్లో దోచేస్తున్న ముఠా అరెస్ట్

అధిక లాభం ఆశ  చూపి కోట్లల్లో దోచేస్తున్న ముఠా అరెస్ట్

- Advertisement -

మార్కెటింగ్ పేరుతో మనీ లాండరింగ్ 
హెబ్సిబా పేరుతో యదేచ్ఛగా దోపిడి 
వరంగల్ సిపి సన్ ప్రీత్ సింగ్ 
నవతెలంగాణ-పాలకుర్తి

పెట్టిన పెట్టుబడికి అధిక మొత్తంలో లాభం ఆశ చూపిస్తూ ప్రజల నుండి కోట్ల రూపాయలను దోచేసిన నలుగురు సభ్యుల ముఠాను టాస్క్ ఫోర్స్, పాలకుర్తి పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుండి 5లక్షల92వేల రూపాయలతో పాటు, 684.5 గ్రాముల బంగారు నాణాలు,150 గ్రాముల బంగారు ఆభరణాలు,ఒక కారు సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్, రసీదు పుస్తకాలు, క్యాష్ కౌంటింగ్ మిషన్, చెక్ బుక్స్, స్టాంప్స్ తో పాటు పొలాలు, ఇంటి స్థలాలకు సంబంధించిన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం వరంగల్లో పేదలను కోట్లల్లో దోచేసిన ముఠాను అరెస్టు చేసిన అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్ తో కలిసి వరంగల్ సిపి సన్ ప్రీత్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా గడ్డిపల్లి గ్రామానికి చెందిన తిప్పాలి సైదులు ప్రస్తుతం మార్కెటింగ్ పేరుతో మోసపూరితమైన వ్యాపారం చేస్తూ పాలకుర్తిలో నివాసముటున్నాడని తెలిపారు. సైదులతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా నందిగామ కు చెందిన మనుబోతుల రామకృష్ణ,సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ గ్రామానికి చెందిన పొడిల సురేష్, సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ కు చెందిన పొడిల శ్రీధర్ పాలకుర్తిలో నివాసముంటు మార్కెటింగ్ పేరుతో మనీ లాండరింగ్ మోసాలకు పాల్పడి ప్రజల అందిన కాడికి దోచుకున్నారని తెలిపారు. నిందితుడు  సైదులు తన భార్య నారాయణమ్మ పేరు మీద హెబ్సిబా  పేరుతో ఒక సంస్థను  2023 సంవత్సరంలో ఏర్పాటు చేసాడని వివరించారు.   2024 సంవత్సరంలో  ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అధిక లాభాలు ఆశ చూపిస్తూ చీటీ వ్యాపారాన్ని ప్రారంభించాడని తెలిపారు. ఈ చిట్టీ లో  చేరే వారు ముందుగా ఆరు వేల రూపాయలను చెల్లించాల్సి ఉంటుందని. సభ్యులు చెల్లించిన డబ్బులో నాలుగు వేలు తన వద్దనే డిపాజిట్ చేసుకొని మిగితా రెండు రెండు వేల రూపాయలకు సభ్యులకు ఈ సంస్థపై నమ్మకం  కలిగేందుకు సభ్యులకు రెండు వేల రూపాయల విలువ వస్తువులను అందజేస్తూ ప్రజలను మోసం చేశాడని వివరించారు.   వస్తువుల విలువ కేవలం మూడు వందలు మాత్రమే వుంటాయని. ఈ సంస్థ లో ఒక సభ్యుడు ఎన్ని సభ్యత్వాలైన పొందవచ్చునని. ఇందులో జాయిన్ అయిన ప్రతి సభ్యుడికి నెలకు వెయ్యి రూపాయల చొప్పున 20 నెలల పాటు డబ్బు ను తిరిగి అందజేసేవాడని వివరించారు. ప్రధాన నిందితుడు మిగితా నిందితులతో కలసి గ్రామాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని సుమారు 28, 493 సభ్యత్వాలను నమోదు చేసుకోవడంతో పాటు  4వేల రూపాయల చొప్పున మొత్తం 11 కోట్ల39 లక్షల రూపాయలు ప్రజల డబ్బు ను తన వద్దనే  భద్రపరుచుకొని వ్యాపారం నిర్వహిస్తున్నాడని తెలిపారు.  నిందితుడు సభ్యులకు కేవలం మూడు వందల రూపాయల విలువ వస్తువులను అందజేయడం ద్వారా మరో4కోట్ల 84 లక్షల రూపాయలను మోసం చేసినట్లుగా పోలీసుల దర్యాప్తు లో నిర్ధారణ అయిందని వివరించారు. ప్రజలు అత్యాశతో ఈ సంస్థ లో లక్షల్లో పెట్టుబడులు పెట్టారని తెలిపారు. ఈ సంస్థపై పోలీసులకు పలు పిర్యాదులు రావడంతో పాటు ఈ ముఠా సభ్యులు ప్రజల సొమ్ము తో తప్పించుకు పారిపోయే ప్రమాదాన్ని గుర్తించిన పోలీసులు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకొని విచారించగా  ముఠా పాల్పడే మోసం పోలీసులకు వెల్లడించడంతో పాటు  ముఠా వసూల్ చేసిన డబ్బును వివిధ 17 బ్యాంకుల్లో జమ చేసినట్లుగా గుర్తించిన పోలీస్ అధికారులు, 5కోట్ల 48 లక్షల, 64 వేల రూపాయలకు సంబంధించి ఎలాంటి లావా దేవీలు జరగకుండా బ్యాంక్ ఖాతాలను నిలిపివేయడం  జరిగిందని తెలిపారు. 
ప్రధాన నిందితుడు పై గతంలో మెదక్, సూర్యాపేట జిల్లాలతో పాటు ఇల్లందు, ఎల్. బి నగర్ పోలీస్ స్టేషన్ల లో సుమారు పదికి పై గా  చీటింగ్ కేసులు ఉన్నట్లు వరంగల్  సీపీ వెల్లడించారు.

 ప్రజలు అధిక మొత్తం లో లాభం వస్తున్నదని బోగస్ కంపెనీ లను నమ్మి ఎక్కువ మొత్తం లో డబ్బులు జమ చేస్తే ఎప్పుడో ఒకప్పుడు ఆ కంపెనీ బోర్డ్ తిప్పేస్తారని, ప్రజలు నష్టపోతారని అన్నారు.  మోసాగాళ్ల  మాటలు నమ్మకుండా  డబ్బులు పెట్టుబడి పెట్టేముందు జాగ్రత్తగా ఆలోచించాలని ప్రజలకు సూచించారు. తక్కువ సమయం లో ఎక్కువ లాభం వస్తున్నదని  చెబితే ఎవరు నమ్మవద్దని సీపీ ప్రజలకు సూచించారు.
 ముఠాను పట్టు కోవడంలో ప్రతిభ కనబరిచిన  వెస్ట్ జోన్  ఫోర్స్ ఇన్స్ స్పెక్టర్  పవన్ , పాలకుర్తి సిఐ  జానకీరాం రెడ్డి, పాలకుర్తి ఎస్. ఐ దూలం పవన్ కుమార్, టాస్క్ ఫోర్స్ ఎస్. ఐ వంశీ కృష్ణ, దిలీప్ లతో పాటు టాస్క్ ఫోర్స్ , పాలకుర్తి పోలీస్ సిబ్బంది ని పోలీస్ అధికారులు, సిబ్బందిని సీపీ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -