Wednesday, October 1, 2025
E-PAPER
Homeనల్లగొండపెద్దవూర మండలంలో నేటి నుంచి రేషన్ షాపులు బంద్

పెద్దవూర మండలంలో నేటి నుంచి రేషన్ షాపులు బంద్

- Advertisement -


నవతెలంగాణ-పెద్దవూర
నేటినుంచి పెద్దవూర మండలం లో దుకాణాలు మూతపడనున్నాయి. పలు డిమాండ్లతో రేషన్ డీలర్ల సంఘం చేపట్టిన నిరసనలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతోనే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్ల యూనియన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.గత 5 నెలలుగా రేషన్ డీలర్లకు కమీషన్ అందలేదు. దీనికి తోడు రూ.5 వేల కనీస గౌరవ వేతనం డిమాండ్ చేస్తున్నారు డీలర్లు. ఈ క్రమంలో వివిధ రూపాల్లో తమ నిరసనలు తెలియజేస్తూ వచ్చారు. రేషన్ డీలర్ల సంఘం నాయకులు సోమవారం మండలం లోని 34 మంది కలెక్టర్లకి వినతి పత్రాలు సమర్పించారు కూడా. అయితే ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని డీలర్ల సంఘం గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో ఇక బియ్యం పంపిణీ చేసేది లేదని రేషన్ డీలర్ల సంఘం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దేశంలో ఎక్కడా కమీషన్ను ప్రభుత్వం పెండింగ్ పెట్టిన దాఖలాలు లేవని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇస్తేనే తిరిగి రేషన్ షాపులు తెరుస్తామని అంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -