- Advertisement -
నవతెలంగాణ-నిజాంసాగర్
వేతనం రాక.. పూట గడవక అనే శీర్షికతో తాహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ల కష్టాల గురించి గత నెలలో కథనం ప్రచురితమైన విషయం విధితమే. వచ్చే అరకోర వేతనం సైతం పెండింగ్ లో పెట్టడంతో వారు ఎదుర్కొంటున్న సమస్యలపై నవ తెలంగాణ ప్రచురించిన కథనానికి ప్రభుత్వం స్పందించింది. వారి ఖాతాలలో పెండింగ్ వేతనాలు బుధవారం జమ చేశారు. వారికి వచ్చే అరకొర వేతనం సరిపోవడం లేదని గుర్తించి వారి వేతనాన్ని రూ.28,000 పెంచడం పట్ల ఆపరేటర్లు హర్షం వ్యక్తం చేశారు. వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినందుకు నవతెలంగాణ పత్రికకు కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -