Thursday, October 2, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంవీడియో గేమింగ్‌ వ్యాపారంలోకి ట్రంప్‌ అల్లుడు

వీడియో గేమింగ్‌ వ్యాపారంలోకి ట్రంప్‌ అల్లుడు

- Advertisement -

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కుటుంబ వ్యాపార సామ్రాజ్యం మూడు పూలు…ఆరు కాయలుగా విస్తరిస్తోంది. ట్రంప్‌ అల్లుడు జేర్డ్‌ కుష్‌నర్‌ సీఈఓగా వ్యవహరిస్తున్న ప్రయివేటు ఈక్విటీ సంస్థ అఫినిటీ పార్ట్‌నర్‌, సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (పీఐఎఫ్‌)తో కూడిన ఇన్వెస్టర్‌ గ్రూప్‌ ప్రముఖ వీడియో గేమ్‌ ప్రచురణకర్త ఎలక్ట్రానిక్‌ ఆర్ట్‌ను (ఈఏ) కొనుగోలు చేస్తోంది. ఈ ఒప్పందం విలువ యాభై ఐదు బిలియన్‌ డాలర్లు. ఈ వీడియో గేమ్‌ పబ్లిషర్‌ 1990 నుంచి ప్రభుత్వ సంస్థగా కొనసాగుతోంది. కాగా ఈ ఒప్పందం అమెరికా చరిత్రలో రెండో అతి పెద్ద గేమింగ్‌ కొనుగోలుగా నిలుస్తోంది. ఈఏ కంపెనీని 1982లో ఆపిల్‌ మాజీ ఉద్యోగి ట్రిప్‌ హాకిన్స్‌ ఏర్పాటు చేశారు. ఇది బ్యాటిల్‌ఫీల్డ్‌, ఈఏ స్పోర్ట్స్‌ ఎఫ్‌సీ, మద్దెన్‌, ది సిమ్స్‌ వంటి పేరొందిన గేమ్స్‌కు ప్రసిద్ధి. ట్రంప్‌ శ్వేతసౌధంలో అడుగు పెట్టినప్పటి నుంచి ఆయన కుటుంబ కంపెనీలు, ఆయన మద్దతు ఇస్తున్న కంపెనీలలోకి పెద్ద మొత్తంలో డబ్బు చేరుతోంది. ఈ కంపెనీ లలో రియల్‌ ఎస్టేట్‌, క్రిప్టో కరెన్సీ, ప్రయివేట్‌ క్లబ్‌ ఉన్నాయి. ఈ ప్రయివేటు క్లబ్‌ను వాషింగ్ట న్‌లో ప్రారం భించబోతు న్నారు. దీని సభ్యత్వ ఫీజే ఐదు లక్షల డాలర్లు. క్రిప్టో కరెన్సీ కంపెనీని డోనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ నిర్వహిస్తుంటారు. ట్రంప్‌నకు చెందిన గోల్ఫ్‌, విలాసవంతమైన విల్లా ప్రాజెక్టుకు పాక్షికంగా నిధులు అందించేందుకు ఖతార్‌ అంగీకరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -