వెబ్‌ఆప్షన్ల నమోదుకు రేపే ఆఖరు

Tomorrow is the deadline for weboptions registration– ఎంసెట్‌ బైపీసీ కౌన్సెలింగ్‌లో ధ్రువపత్రాల పరిశీలనకు 15,388 మంది
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి బీ ఫార్మసీ, ఫార్మా-డీ, బయోటెక్నాలజీ, ఫార్మాసూటికల్‌ ఇంజినీరింగ్‌, బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌, బయో టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్‌ బైపీసీ విద్యార్థులకు నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌ ప్రక్రియలో మంగళవారం నాటికి ధ్రువపత్రాల పరిశీలన గడువు ముగిసింది. అయితే వెబ్‌ఆప్షన్ల నమోదు గడువు గురువారంతో ముగియనుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, ఎంసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ వాకాటి కరుణ ఒక ప్రకటన విడుదల చేశారు. ధ్రువపత్రాల పరిశీలనకు 15,388 మంది అభ్యర్థులు హాజరయ్యారని వివరించారు. ఇప్పటి వరకు 3,442 మంది అభ్యర్థులు 90,251 వెబ్‌ఆప్షన్ల నమోదు చేశారని తెలిపారు. ఒక అభ్యర్థి అత్యధికంగా 188 ఆప్షన్లు ఇచ్చారని పేర్కొన్నారు. ఈనెల 11 నాటికి సీట్లు కేటాయిస్తామని తెలిపారు. ఇతర వివరాల కోసం ష్ట్ర్‌్‌జూర://్‌రవaఎషవ్‌b.అఱష.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

Spread the love