Thursday, October 2, 2025
E-PAPER
Homeజాతీయంఖర్గేను ఫోన్ లో పరామర్శించిన ప్రధాని మోడీ

ఖర్గేను ఫోన్ లో పరామర్శించిన ప్రధాని మోడీ

- Advertisement -

నవతెలంగాణ ఢిల్లీ:

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (83)కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. ఖర్గే ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు మల్లిఖార్జున ఖర్గేకు ఫోన్ చేసినట్టుగా ప్రధాని మోడీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఖర్గే త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దీర్ఘాయుష్షుతో ఉండాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే ఖర్గే కుమారుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ.. తన తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆయన క్షేమంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు పేస్‌మేకర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్స జరిగింది. దీంతో ఆయన అస్వస్థతకు గురయ్యారు. వెంటనే బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆస్పత్రిలో చేరారు.

మంగళవారం రాత్రి ఖర్గేకు నిరంతర జ్వరం రావడంతో బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ఖర్గే ఆస్పత్రిలో చేరిన వార్త దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులలో ఆందోళనను రేకెత్తించింది. ఆయన త్వరగా కోలుకోవాలని పార్టీ సీనియర్ నాయకులు ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -