Friday, October 3, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఫలక్‌నుమా రోడ్ ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్..

ఫలక్‌నుమా రోడ్ ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్‌: హైదరాబాద్ లోని ఫలక్ నుమాలో కొత్త రోడ్ ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. పాత ఆర్ఓబీకి సమాంతరంగా నిర్మించిన కొత్త ఆర్ఓబీని శుక్రవారం ( అక్టోబర్ 3 ) ప్రారంభించారు మంత్రి పొన్నం. రూ. 52 కోట్ల 3 లక్షల వ్యయంతో ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసింది జీహెచ్ఎంసీ. 360 మీటర్ల పొడవుతో రెండు లైన్ల నిర్మాణంతో బార్కాస్ జంక్షన్ నుంచి ఫలక్ నుమా బస్ డిపో వరకు ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది.

రైల్వే ట్రాక్పై నిర్మించిన పాత ఆర్ఓబీకి సమాంతరంగా అందుబాటులోకి వచ్చిన మరో ఆర్ఓబీ ఇది కావడం గమనార్హం. మొదట నిర్మించిన ఆర్ఓబీ కేవలం రెండు లైన్లు మాత్రమే ఉండడంతో ట్రాఫిక్ రద్దీ పెరిగింది. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మరో రెండు లైన్లను నిర్మించింది ప్రభుత్వం. రూ. 52 కోట్ల 3 లక్షల వ్యయంతో, 360 మీటర్ల పొడవుతో రెండు లైన్లుగా ఈ కొత్త రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది.

ఇక నేటి నుంచి ఈ బ్రిడ్జిని ప్రారంభించడంతో, కొంతకాలంగా ఫలక్‌నుమా నుంచి చాంద్రాయణ గుట్టతో సహా ఇతర ప్రాంతాలకు వెళ్లే పాతబస్తీ ప్రయాణికులకు ఊరట లభించింది. ఫలక్‌నుమా కరెంట్ ఆఫీస్ నుంచి కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జి వల్ల చాంద్రాయణ గుట్ట జంక్షన్ నుంచి ఫలక్ నుమా బస్ డిపో వరకు ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా.. అంబర్​పేట, దిల్​సుఖ్​నగర్ ప్రాంతాలను కలిపే మూసారాంబాగ్ పాత బ్రిడ్జి ప్రస్థానం ఇక ముగిసినట్టే. ఇక్కడ ఇప్పటికే ఓవైపు కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతుండగా, పాత బ్రిడ్జి ఇటీవల వచ్చిన భారీ వరదలకు కోతకు గురైంది. దీంతో పటిష్టతను పరిశీలించిన జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులు ఈ బ్రిడ్జికి రిపేర్లు కాకుండా దీని స్థానంలో కొత్తది నిర్మిస్తేనే మంచిదని నిర్ణయించారు.

వచ్చే ఏడాది మార్చిలోపు కొత్త బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని, అప్పటివరకు రాకపోకలు పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించారు. అలాగే ప్రస్తుతం కోతకు గురైన బ్రిడ్జి పనులను కూడా వెంటనే ప్రారంభించి జూన్ లోగా పూర్తి చేయాలని అధికారులు డెడ్ లైన్ పెట్టుకున్నట్లు తెలిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -