నవతెలంగాణ చత్తీస్‌గఢ్: గాంధీజయంతి రోజున చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుమారు 103 మంది మావోయిస్టులు ఆయుధాలు వదలి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. రాష్ట్రప్రభుత్వం ఆదేశాలతో బీజాపూర్ జిల్లాలోని పోలీసు, పారామిలటరీ అధికారుల సమక్షంలో ఏర్పాటు చేసిన పూనా మర్గం అనే కార్యక్రమంలో భాగంగా వీరంతా తమ ఆయుధాలను పోలీసులకు సమర్పించి లొంగిపోయారు. ఈ పూనా మార్గం అనే కార్యక్రమం కింద తొంగిపోయిన మావోయిస్టుకు ప్రభుత్వం తక్షణ సహాయం అందజేసి వారు కొత్త జీవితం సాగించేందుకు దోహదపడుతోంది.
ఈ కార్యక్రమం కింద ప్రస్తుతం లొంగిపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తక్షణ సాయంగా కింద రూ.50,000 చెక్కును అందించింది. అయితే ప్రస్తుతం లొంగిపోయిన వారిలో సుమారు 90 మందికిపై రూ. రూ.1.06 కోట్ల రివార్డు ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో చాలా మంది మావోయిస్టు సిద్ధాంతాలపై నమ్మకం కోల్పోయి, సంస్థలో అంతర్గత విభేదాలు, ప్రశాంతమైన జీవితం గడపాలనే ఉద్దేశంతోనే లొంగిపోయినట్టు అధికారులు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం మంచి ఫతాలనిను ఇస్తోందని సీనియర్ పోలీసు అధికారులు అంటున్నారు.ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటివరకు బీజాపూర్ జిల్లాలో సుమారు 421 మంది మావోయిస్టులను అరెస్టు చేయగా, 410 మంది లొంగిపోయినట్టు అధికారులు తెలిపారు. మరో 137 మంది వివిధ ఎన్‌కౌంటర్లలో మరణించినట్టు చెప్పుకొచ్చారు.