Friday, October 3, 2025
E-PAPER
Homeజిల్లాలు6న‌ ఐఎఫ్‌టీయూ ధర్నా

6న‌ ఐఎఫ్‌టీయూ ధర్నా

- Advertisement -
  • జిల్లా ఐఎఫ్‌టీయూ ప్రధాన కార్యదర్శి దాసు పిలుపు
    నవ తెలంగాణ-జక్రాన్‌పల్లి: కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మిక సమస్యల్ని పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ ఆరోన‌ జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించి, జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలను అందజేయాలని, రాష్ట్ర సదస్సు తీర్మానించిందని ఐఎఫ్‌టీయూ నిజాంబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు తెలిపారు. అక్టోబర్ 3 తేదీన జక్రాన్ పల్లి మండల కేంద్రంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. దాసు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు 2016 అక్టోబర్ 26 తేదీన సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పునిచ్చిందని, 9 సంవత్సరాలు నిండిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకుండా కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల ఉపాధి, భద్రత కల్పించి, కనీస వేతనం 26 వేలకు పెంచి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగు చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలదే అని ఆయన గుర్తు చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి ప్రభుత్వ రంగ సంస్థలను వేలం వేస్తూ దేశంలో ఉన్న మెజార్టీ హిందువులకు మోసం చేస్తుందని ఆయన అన్నారు.

కలిసి ఉన్న కార్మికులను విభజిస్తూ, ఓట్లు కొల్లగొడుతుందని ఆయన తెలిపారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చలో నిజామాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని దాసు కార్మికులకు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఐఎఫ్టియు నాయకులు బాలయ్య, సోప్పరి గంగాధర్, భానుచందర్, రాజన్న, పల్నాటి సాయిలు, అర్గుల్ మోహన్, ముగ్ధంపటేల్, గణేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -