నవతెలంగాణ-కమ్మర్‌పల్లి: దసరా పండుగ సందర్భంగా స్వగ్రామం వేల్పూర్‌లో రాష్ట్ర మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శుక్రవారం అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి నియోజకవర్గంలోని ఆయా మండలాల నుండి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అలాయ్ బలాయ్ కార్యక్రమానికి విచ్చేసిన పార్టీ శ్రేణుకు, శ్రేయోభిలాషులకు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మీయ పలకరింపుతో నాయకులు, కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని కలిసిన నాయకులు, కార్యకర్తలు, ఆత్మీయులు ఆయనకు దసరా పండగ శుభాకాంక్షలు తెలిపి ఫోటోలు దిగారు.కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆయా మండలాల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖల అధ్యక్షులు, సింగిల్ విండో చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
