Friday, October 3, 2025
E-PAPER
Homeనిజామాబాద్యువత సన్మార్గంలో నడిచినప్పుడు దేశ భవిష్యత్తు బాగుండేది

యువత సన్మార్గంలో నడిచినప్పుడు దేశ భవిష్యత్తు బాగుండేది

- Advertisement -
  • పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
    నవతెలంగాణ-కంఠేశ్వర్‌: యువత సన్మార్గంలో నడిచినప్పుడు దేశ భవిష్యత్తు బాగుండేది అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. మొగుపాల్ పోలీస్ స్టేషన్ వారి సరికొత్త ఆలోచన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో నిజామాబాద్ డివిజన్ పరిధిలోని మొగుపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రెసిడెంట్ పాఠశాల మైదానం యందు 13 గ్రామాల నుండి 13 టీంలను ఏర్పాటు చేసి కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా యువత డ్రగ్స్, చెడు వ్యసనాలకు దూరముగా ఉండేందుకు యువత కోసం క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని మొగుపాల్ పోలీస్ వారి ఆధ్వర్యంలో గత నాలుగు రోజుల నుండి క్రికెట్ టోర్నమెంట్‌ని నిర్వహించారు.

క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య హాజరు కావడం జరిగింది. క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య క్రికెట్ మ్యాచ్ ను ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ.. ప్రియమైన యువకులకు మీరందరూ ఈ క్రికెట్ టోర్నమెంట్‌లో ఉత్సాహంగా పాల్గొని, ఆటలో స్పూర్తిని చూపినందుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఇది కేవలం ఒక ఆట మాత్రమే కాదు, మిమ్మల్ని నైతికంగా, శారీరకంగా, మానసికంగా బలంగా తీర్చిదిద్దే ఒక మంచి సాధనంగా కూడా భావించాలి.ఈ రోజు మన సమాజంలో యువత పెద్ద ఎత్తున మత్తుపదార్థాల వైపు ఆకర్షితమవుతోంది. ఇది ఒక ప్రమాదకరమైన మార్గం. ఒక్కసారైనా ఆ వ్యసనాల్లోకి అడుగుపెడితే, జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకునే ప్రమాదం ఉంది. యువత దేశ భవిష్యత్తు, మీరు ఆరోగ్యంగా ఉంటూ, మంచి ఆశయాలతో, పట్టుదలతో ముందుకు సాగాలని, ఇలాంటి క్రీడా కార్యక్రమాలు మీకు సానుకూలమైన దారిలో దిశానిర్దేశం చేస్తాయి.

అనంతరం క్రీడాకారులకు బహుమతులు పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసిపి రాజా వెంకటరెడ్డి , సౌత్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్. సురేష్ కుమార్ , మొగుపాల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ జెడ్. సుస్మిత, 13 క్రికెట్ జట్ల యువత పోలీస్ స్టేషన్ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -