Friday, October 3, 2025
E-PAPER
Homeమెదక్చందాపూర్‌లో అగ్ని ప్ర‌మాదం

చందాపూర్‌లో అగ్ని ప్ర‌మాదం

- Advertisement -

నవతెలంగాణ-తొగుట: పండుగ పూట వంట చేస్తుండగా గ్యాస్ లేకేజ్ తో ప్రమాదవశాత్తు అగ్రి ప్రమాదం జరిగింది. గురువారం మండలంలోని చందాపూర్ గ్రామంలో బెజ గామ నర్సయ్య ఇంట్లో పండగ రోజు ఉదయం సమయం వంట చేస్తుండగా గ్యాస్ లికేజ్ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తం అయిన కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారు. గ్యాస్ మంటలు పక్కనే ఉన్న ఫ్రిడ్జి మీదికి వ్యాపించడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు.

వారు మంటలను అర్పివేశారు. అగ్ని ప్రమాదం వల్ల ఫ్రిడ్జితో పాటు బియ్యం, బట్టలు, వంట సామాగ్రి మొత్తం తగల బడ్డాయి. వాటి విలు వ దాదాపు రూ. 1 లక్ష వరకు నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు నర్సయ్య కోరాడు. ఇల్లు కాలిపోవడం ఇబ్బందిగా మారిందన్నారు. విషయం తెలుసుకున్న రెవిన్యూ సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పంచనామా నిర్వహించి ఉన్నత ఆధికారులకు నివేదిక అందిస్తామని తెలిపారు. ప్రాణాపాయం నుండి బయట పడ్డారు కాని తినడానికి తిండి లేక పండగ పూట పస్తులు ఉండవలసిన దుస్థితి ఏర్పడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -