నవతెలంగాణ-నిజామాబాద్ సిటీ: గాంధేయ మార్గం అందరికి అనుసరణీయమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, అదనపు కలెక్టర్ అంకిత్ అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని గురువారం నిజామాబాద్ నగరంలోని గాంధీచౌక్ లో గల మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఇరువురు జాతి నేతలు దేశానికి అందించిన సేవలను కొనియాడారు. మహాత్ముడు చూపిన బాటలో పయనిస్తూ దేశాభ్యున్నతికి, సమాజ హితానికి పాటుపడాలని పిలుపునిచ్చారు.జయంతి వేడుకలలో వివిధ శాఖల అధికారులు, పుర ప్రముఖులు, ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES