Friday, October 3, 2025
E-PAPER
Homeమెదక్మైక్ సెట్ బహుకరణ

మైక్ సెట్ బహుకరణ

- Advertisement -

నవతెలంగాణ-చిన్నకోడూరు: మండల పరిధిలోని అల్లిపూర్ గ్రామానికి చెందిన యువకుడు కుంభాల చంద్రశేఖర్ గ్రామంలోని మహిళలకు ఆంప్లిఫైర్ మైక్ సెట్ ను శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో దుర్గామాత విగ్రహం వద్ద రోజు పూజలు చేస్తుండంతో మైక్ సెట్ లేకపోవడంతో ఇబ్బందులకు గురి అవుతున్నారని గుర్తించి 20వేలవిలువగల మైక్ సెట్ ను 9,10 వార్డు సభ్యుల మహిళలకుఅందజేసినట్లు తెలిపారు గ్రామానికి సేవ చేయడం ఎంతో సంతృప్తిగా ఉందని అన్నారు. మనం ఒకరికి సేవ చేయడంలో ఎంతో సంతృప్తి ఉంటుందని ఇతరులకు సేవ చేయడం వల్ల మనసు కుదుటపడుతుందన్నారు సేవా ద్వారా వచ్చే తృప్తి వేల కట్టలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు యువకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -