- Advertisement -
నవతెలంగాణ-పెద్దవంగర: మండలంలోని పోచారం గ్రామానికి చెందిన పోగు భాస్కర్- యమున దంపతుల కుమార్తె ప్రణిత ఇటీవల వెలువడిన నీట్ ఫలితాల్లో ఎంబీబీఎస్ సీటు సాధించింది. ఆమె ను పోపా (పద్మశాలి) ప్రతినిథులు శుక్రవారం ఘనంగా సన్మానించారు. కాగా ఆమె రాష్ట్ర స్థాయి లో ఆమె 2798 ర్యాంక్ సాధించి, మహబూబాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు సాధించింది. ప్రణిత తండ్రి గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ, గ్రామీణ వైద్యుడిగా సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డాక్టర్ కావడమే తన లక్ష్యమని అన్నారు. ప్రణిత ఎంబీబీఎస్ సీటు సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో పోపా ప్రతినిథులు పాల్గొన్నారు.
- Advertisement -