Friday, October 3, 2025
E-PAPER
Homeనిజామాబాద్మెడికల్ సీటు సాధించిన మిరుదొడ్డి సాత్విక..

మెడికల్ సీటు సాధించిన మిరుదొడ్డి సాత్విక..

- Advertisement -

నవతెలంగాణ-మిరుదొడ్డి: పట్టుదల, కష్టపడే తత్వం ఉంటే ఏ అడ్డంకులైనా అధిగమించవచ్చని నిరూపించింది సిద్దిపేట జిల్లా మిరుదొడ్డికి చెందిన గడ్డం సాత్విక. ప్రభుత్వ గురుకులంలోనే చదువుకున్నా… సంకల్పం ఉంటే అవకాశాలు దూరంగా ఉండవని చాటి చెప్పింది. ఉత్తమ ప్రతిభతో మెడికల్ సీటు సాధించి అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. తల్లి బీడీ కార్మికురాలు, తండ్రి కండక్టర్. సంకల్పంతో ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమైంది. ఎలాంటి కోచింగ్ లేకుండా ఇంటి దగ్గరే ఉండి చదువుకున్నది. ఇటీవల నిర్వహించిన నీట్ యుజి – 2025 రెండో విడత కౌన్సెలింగ్‌లో మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు పొందింది. ఆల్‌ఇండియా ర్యాంక్‌ 1,70,560తో పాటు రాష్ట్ర మెరిట్‌లిస్ట్‌లో 3,265వ స్థానం సాధించింది.5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే పాఠశాలలో పూర్తి చేసింది. మహాత్మా జ్యోతిబాపూలే సీఓఈ సరూర్‌నగర్‌లో ఇంటర్మీడియట్ చదివి ఈ విజయం అందుకుంది.

తల్లిదండ్రుల ఆనందం: వెంకట నర్సయ్య, లక్ష్మి
“మా అమ్మాయి కష్టపడి చదివి ఈ స్థాయికి చేరుకుంది. ఆర్థిక పరిస్థితులు అంతగా బాగాలేకపోయినా, ఆమె కృషి, పట్టుదల వల్ల ఈ ఫలితం సాధ్యమైంది. మా కూతురు డాక్టర్ అవుతుందన్న ఆలోచనతో సంతోషంగా ఉంది.పల్లె ప్రజలకు వైద్య సేవలు అందించడం నా లక్ష్యం: సాత్విక “నేను పూర్తిగా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివాను. గురువులు బోధించిన విద్యాబుద్ధులతో పాటు వారిచ్చిన సలహాలు సూచనలు నాకు ఎంతగానో దోహదం చేశాయి. కష్టపడి చదివితే ఎవరైనా విజయం సాధించవచ్చు. వైద్యురాలిగా గ్రామ ప్రజలకు సేవ చేయడం నా కల” అని సాత్విక ఆనందం వ్యక్తం చేసింది.

మారుమూల గ్రామాల విద్యార్థులకు గర్వకారణం
ప్రభుత్వ పాఠశాలల్లో చదివి మెడికల్ సీటు సాధించడం గర్వకారణమని మిరుదొడ్డి గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి, సాధారణ కుటుంబం నుంచి వచ్చి, పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకోవచ్చని సాత్విక చూపించిందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఆమె విజయం ప్రభుత్వ విద్యపై విశ్వాసాన్ని మరింతగా పెంచిందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -