- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన ఏనుగు మహేందర్‌రెడ్డి(26) లండన్‌లో గుండెపోటుతో మృతి చెందారు. ఆయన రెండు సంవత్సరాల క్రితం పీజీ చేసేందుకు లండన్ వెళ్లి ఇటీవలే పూర్తి చేశారు. వర్క్ వీసా కూడా వచ్చింది. మహేందర్ తండ్రి రమేశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మేడిపల్లి మండల అధ్యక్షుడిగా ఉన్నారు. యువకుడి మృతి పట్ల ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, పలువురు ప్రజా ప్రతినిధులు సంతాపం తెలిపారు.
- Advertisement -