Saturday, October 4, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం..

సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధి లోతుకుంట వద్ద ఓ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. లోతుకుంట ప్రధాన రహదారి పక్కనే ఉన్న సైకిల్ దుకాణంలో చెలరేగిన మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించడంతో అగ్నిప్రమాద తీవ్రత పెరిగింది. ఈ అగ్ని ప్రమాద ఘటనలో ఆరు దుకాణాలు దగ్ధం కాగా ఆస్తి నష్టం వాటిల్లింది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో సకాలంలో ఘటన స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దుకాణాలలో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -