- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: జపాన్ దేశానికి తొలిసారి ఓ మహిళ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ సనాయి తకాయిచిని కొత్త నేతగా ఎన్నుకున్నారు. దీంతో 64 ఏళ్ల ఆ మహిళ.. జపాన్ ప్రధానిగా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి. గత కొన్నాళ్లుగా కన్జర్వేటివ్ పార్టీలో లుకలుకలు ఉన్నాయి. సంక్షోభంలో ఉన్న ఆ పార్టీని ఏకీకృతం చేసేందుకు ఆమె తీవ్ర ప్రయత్నాలు చేపట్టారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ప్రధాని షిగేరు ఇషిబా త్వరలో తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు గత నెలలో ప్రకటించారు.
- Advertisement -