Saturday, October 4, 2025
E-PAPER
Homeబీజినెస్యువర్ స్పేస్, యువర్ కంఫర్ట్" అనే ప్రచారాన్ని ప్రారంభించిన స్పేసెస్

యువర్ స్పేస్, యువర్ కంఫర్ట్” అనే ప్రచారాన్ని ప్రారంభించిన స్పేసెస్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: వెల్‌స్పన్ లివింగ్ కు చెందిన ప్రీమియం బెడ్, బాత్ లినెన్ బ్రాండ్ అయిన స్పేసెస్ ( SPACES) ,  “యువర్ స్పేస్, యువర్ కంఫర్ట్” పేరిట తమ సరి కొత్త ప్రచారం ప్రారంభించినట్లు నేడు వెల్లడించింది.  ^ a t o m నెట్‌వర్క్ తీర్చిదిద్దిన ఈ ప్రచారం, ఇంటికి తిరిగి రావడంలో ఉన్న సాటిలేని ఆనందాన్ని, వ్యక్తిగత ప్రాంగణాలను నిజంగా సౌకర్యవంతంగా మార్చే రోజువారీ క్షణాలను వెల్లడిస్తుంది.

సన్నిహిత మరియు సంబంధిత  అనుభవాలను ఒడిసిపడుతూ , “యువర్ స్పేస్, యువర్ కంఫర్ట్” ప్రచారం,  ఇంటిని దేవాలయంగా మార్చే రోజువారీ పనులను వేడుక జరుపుకుంటుంది. ఇది రోజంతా శ్రమించిన తరువాత మనకు తెలిసిన దుప్పట్లో దూరి పోయినా లేదా వేడుకల తర్వాత మృదువైన, హాయిగా ఉండే బాత్రోబ్ లో మీ భాగస్వామితో విశ్రాంతి తీసుకుంటున్నా – వ్యక్తిగతంగా అనిపించినప్పటికీ అందరి  జీవితాల్లో కనిపించే చిరు, సన్నిహిత క్షణాలను హైలైట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.  బ్రాండ్ యొక్క యువర్ స్పేస్, యువర్ కంఫర్ట్ యొక్క భావనను సంపూర్ణంగా ప్రతిబింబిస్తుంది.

ఈ ప్రచారం గురించి వెల్‌స్పన్ లివింగ్ ఎండి & సీఈఓ దీపాలి గోయెంకా మాట్లాడుతూ, “వెల్‌స్పన్ లివింగ్‌ వద్ద, మా బ్రాండ్ యొక్క విలువ,  ప్రజల జీవితాల్లో సౌకర్యవంతంగా అల్లుకుపోయే ఉత్పత్తులను సృష్టించడంలోనే కనిపిస్తుందని నమ్ముతుంటాం. స్పేసేస్ , ఎల్లప్పుడూ వ్యక్తిగత మరియు ఆలోచనాత్మకమైన సౌకర్యం కోసం నిలుస్తుంది. ఈ ప్రచారంతో, ప్రతి ఇంటిని ఒక పవిత్ర స్థలంగా  మార్చడానికి ఆవిష్కరణ, సౌందర్యం , మానవ సంబంధాలను కలిపే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వక రూపకల్పన పట్ల  మా నిబద్ధతను మేము పునరుద్ఘాటిస్తున్నాము” అని అన్నారు. 

దీనిపై  స్పేసెస్ వద్ద స్పెషల్ ప్రాజెక్ట్స్ – బిజినెస్ హెడ్ , సీనియర్ విపి – రుచికా అరోరా మాట్లాడుతూ : “మీ స్వంత ప్రాంగణంలో ఉండటంతో పాటుగా మిమ్మల్ని నిజంగా అర్థం చేసుకునే అంశాలు చుట్టూ వున్నప్పుడు అనిర్వచనీయమైన  ఓదార్పు అనుభూతి కలుగుతుంది. స్పేసేస్ వద్ద , మేము ఈ సన్నిహిత సంబంధాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఉత్పత్తిని రూపొందిస్తుంటాము. మా ‘యువర్ స్పేస్ యువర్ కంఫర్ట్’ ప్రచారం మేము ఎల్లప్పుడూ నమ్ముతున్న దాన్ని ఖచ్చితంగా ఒడిసిపడుతుంది: ప్రపంచంలోని అత్యుత్తమ అనుభూతి ఇంటిలోని మీ ప్రాంగణం , మీ సౌకర్యం కు వస్తోంది” అని అన్నారు. 

ఈ చిత్రం గురించి  ^ a t o m నెట్‌వర్క్ సహ వ్యవస్థాపకుడు & సిసిఓ యష్ కుల్‌శ్రేష్ట్ మాట్లాడుతూ  “ఆకర్షణీయమైన గృహాలు , స్టార్ పవర్ ఆధిపత్యం వహించే విభాగంలో , మేము చాలా నిజాయితీగా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాము. సౌకర్యం వ్యక్తిగతమైనది, కొన్నిసార్లు గజిబిజిగా ఉంటుంది, కొన్నిసార్లు చాలా తక్కువగా ఉంటుంది, అయినప్పటికి అది ఎప్పటికీ  మీదే. ఈ ప్రచారంతో, పని, సెలవులు లేదా బిజీగా ఉన్న రోజు తర్వాత ఇంటికి వచ్చే అనుభూతిని మేము  వేడుక  జరుపుకుంటున్నాము. జీవితంలోని ఆ చిన్న విరామాలు, కోరికలు , ఆచారాలు నిజంగా ఆ ప్రాంగణం మీకు  ఇల్లులా అనిపిస్తుంది”  అని అన్నారు. 

తన సామాజిక ఛానెల్‌లలో ఈ ప్రకటన చిత్రాన్ని బ్రాండ్ విడుదల చేసింది. దాని ఉత్పత్తులతో అనుబంధించబడిన అనుభూతిని దాని లక్ష్య ప్రేక్షకులకు తెలియజేయడానికి డిజిటల్, సినిమా, ప్రింట్ మరియు అవుట్-ఆఫ్-హోమ్ (ఓఓహెచ్)  ప్లాట్‌ఫామ్‌లలో దీనిని విస్తరిస్తుంది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -