నవతెలంగాణ – హిందూపూర్: హిందూపూర్‌లోని హౌసింగ్ బోర్డ్ కాలనీ సమీపంలో భారతీ ఎయిర్‌టెల్ తరపున స్టెర్లైట్ టెక్నాలజీస్ లిమిటెడ్ మరియు క్వెస్ కార్ప్ లిమిటెడ్ తరపున ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేయడం కోసం అనధికారకంగా చేపట్టిన తవ్వకం పనుల సమయంలో థింక్ గ్యాస్ (గతంలో ఏజి&పి ప్రథమ్ సంస్థ ) పైప్‌లైన్ ప్రమాదవశాత్తు దెబ్బతిన్నందున హిందూపూర్‌లోని నగర గ్యాస్ సరఫరాలో స్వల్ప అంతరాయం ఏర్పడింది. థింక్ గ్యాస్‌లోని అత్యవసర ప్రతిస్పందన బృందం, ప్రభావిత విభాగాలను త్వరగా వేరుచేసి 10 నిమిషాల్లో గ్యాస్ సరఫరాను పునరుద్ధరించింది. తద్వారా ప్రజల భద్రతను నిర్ధారించటంతో పాటుగా నివాసితులకు అసౌకర్యాన్ని తగ్గించింది. బాధ్యులైన సంస్థపై అధికారికంగా పోలీసు ఫిర్యాదు నమోదు చేసింది. అదే సమయంలో కాంట్రాక్టర్లు, పౌర పనుల ఏజెన్సీలు ఏవైనా తవ్వకం పనులు చేపట్టే ముందుగానే అధికారిక ‘డయల్ బిఫోర్ యు డిగ్’ నంబర్ – 1800 2022 999 ద్వారా నగర మున్సిపల్ అధికారులకు లేదా సిజిడి కంపెనీకి ముందుగానే తెలియజేయాలని కంపెనీ కోరింది.
సెప్టెంబర్ 23న మధ్యాహ్నం 02:28 గంటలకు హిందూపూర్‌లోని హౌసింగ్ బోర్డ్ కాలనీ సమీపంలో థర్డ్ పార్టీ తవ్వకాల సమయంలో 125 mm MDPE చార్జ్డ్ పైప్‌లైన్ దెబ్బతిన్నప్పుడు అంతరాయం ఏర్పడింది. అయితే, థింక్ గ్యాస్ త్వరగా ఆ ప్రదేశానికి చేరుకుని సరఫరాను పునరుద్ధరించింది.
కాంట్రాక్టర్లు , పౌర సంస్థలు ఏదైనా రోడ్డు తవ్వకం లేదా నిర్మాణ పనులను చేపట్టే ముందు భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాల్సిన అత్యవసర అవసరాన్ని ఈ సంఘటనలు నొక్కి చెబుతున్నాయి. ప్రజా భద్రత, నిరంతర ఇంధన సరఫరా వంటి అంశాలు ఈ తరహా బాధ్యతాయుతమైన చర్యలపై ఆధారపడి ఉంటాయి. ఐపీసీ సెక్షన్లు 285 మరియు 336 ప్రకారం, గ్యాస్ మౌలిక సదుపాయాలకు నిర్లక్ష్యంగా , అనధికారికంగా నష్టం కలిగించడం శిక్షార్హమైన నేరం, దీనికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు రూ. 25 కోట్ల వరకు జరిమానా విధించబడుతుంది.
కడప మరియు అనంతపురంలో గృహాలు, వ్యాపారాలు మరియు పరిశ్రమలకు పైప్డ్ నేచురల్ గ్యాస్ (పిఎన్ జి) మరియు రవాణా కోసం కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సిఎన్ జి) అందించడానికి బలమైన సహజ వాయువు నెట్‌వర్క్‌ను థింక్ గ్యాస్ నిర్మించింది. నివారించదగిన భద్రతా ఉల్లంఘనలను నివారించడంలో సహకరించాలని ప్రజలు మరియు కాంట్రాక్టర్లను కంపెనీ కోరుతోంది.