Saturday, October 4, 2025
E-PAPER
Homeబీజినెస్ఇండియన్ ఆయిల్ డైరెక్టర్ గా సౌమిత్ర పీ శ్రీవాస్తవ బాధ్యతలు

ఇండియన్ ఆయిల్ డైరెక్టర్ గా సౌమిత్ర పీ శ్రీవాస్తవ బాధ్యతలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఇండియన్ ఆయిల్‌లో డైరెక్టర్ (మార్కెటింగ్)గా సౌమిత్ర పీ శ్రీవాస్తవ బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ ఆయిల్లో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. ఐఐటీ రూర్కీ నుంచి సివిల్ ఇంజినీరింగ్ పట్టభద్రులు. ముంబైలోని ఎస్‌పీ జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ & రీసెర్చ్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ పట్టా పొందారు. ఎల్‌పీజీ వ్యాపార విభాగంలో నాలుగేళ్లు పని చేసిన తర్వాత సేల్స్ విభాగంలో పలు కీలక పదవులు నిర్వహించారు. ఈ సమయంలో వ్యాపార విస్తరణలో కీలకంగా మారారు.

ఎగ్జిక్యూటివ్‌గా దిగువ స్థాయి ఆపరేషన్స్, మార్కెటింగ్, స్ట్రాటజీ రంగాలలో విస్తృత అనుభవం కలిగి ఉన్నారు. వ్యాపార వృద్ధి, లాభదాయకత, వినియోగదారుల సంతృప్తి వంటి అంశాలలో మంచి రికార్డు ఆయన సొంతం. ఆయన నాయకత్వంలో నాన్-ఫ్యూయల్ కన్వీనియన్స్ స్టోర్స్, ధ్రువ రిటైల్ ట్రాన్స్‌ఫార్మేషన్ ప్రాజెక్ట్ వంటి ప్రధాన ప్రాజెక్టులు విజయవంతంగా అమలయ్యాయి. పలు సాంకేతికత, డిజిటలైజేషన్ ప్రాజెక్టులను కూడా ముందుకు నడిపారు.వరిటైల్ ట్రాన్స్‌ఫార్మేషన్ గ్రూప్ హెడ్‌గా, ఉత్తర, తూర్పు భారతానికి రిటైల్ బిజినెస్ హెడ్‌గా పని చేశారు.

న్యూ ఢిల్లీ, ముంబైలోని డివిజనల్ కార్యాలయాలు నడిపిన అనుభవం ఉంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో సేల్స్ విభాగాన్ని నడిపిన విస్తృత ఆపరేషనల్ నైపుణ్యం ఆయన సొంతం. మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల హెడ్ ఆఫ్ స్టేట్‌గా పని చేసిన సమయంలో ప్రధాన ఉత్పత్తులు, వ్యాపారాలను విజయవంతంగా నిర్వహించారు. ఈ నియామకానికి ముందు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కార్పొరేట్ స్ట్రాటజీ)గా పని చేశారు. ఈ పదవిలో ఆయన వినియోగదారుల సంతృప్తి, కార్యకలాపాలలో మెరుగైన సామర్థ్యం సాధించడానికి వ్యూహాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించారు. కొత్త భాద్యతల్లో ఆయన ఇండియన్ ఆయిల్ మార్కెటింగ్ మౌలిక సదుపాయాలకు వ్యూహాత్మక దిశను అందిస్తూ స్థిరమైన మార్కెట్ లీడర్‌షిప్, వినియోగదారుల సేవలపై దృష్టి సారించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -