- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. బీసీ రిజర్వేషన్లపై తాజాగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని, ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం అంటూ వంగా గోపాల్ రెడ్డి ఇవాళ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు ఎల్లుండి విచారించనుంది. మరో వైపు బీసీ రిజర్వేషన్లపై మాధవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఈ నెల 8వ తేదీన తిరిగి విచారణ జరపనుంది. ఎన్నికల కోసం షెడ్యూల్ రిలీజ్ అయిన నేపథ్యంలో ఓ వైపు హైకోర్టులో మరో వైపు సుప్రీంకోర్టుకు ఈ అంశం చేరడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.
- Advertisement -