నవతెలంగాణ – ఆర్మూర్
రానున్న గోదావరి పుష్కరాలు కోసం జిల్లాలోని శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్ట్ (పోచంపాడ్ నిధులు కేటాయించడం ప్రయత్నం మొదలు పెట్టిన ఎంపీ కే ఆర్ సురేష్ రెడ్డి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్ కు లేఖ రాసినట్టు బిఆర్ఎస్ నాయకులు షాహిద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. (తీర్థయాత్ర పునరుజ్జీవనం, ఆధ్యాత్మిక వృద్ధి డ్రైవ్) పథకం కింద నిధుల కేటాయింపు 2026/27 సంవత్సరంలో గోదావరి పుష్కరాలు జరుగుతున్నాయని, ఇది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే కార్యక్రమం కాబట్టి, లక్షలాది మంది యాత్రికులు ఇక్కడకు వస్తారని తెలిపారు. జిల్లాలోని శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్ట్ (పోచంపాడ్) వద్ద సహాయక మౌలిక సదుపాయాలతో పాటు రాముడు , శివ మందిరాలను అభివృద్ధి చేయడానికి అభ్యర్థిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో, లక్షలాది మంది యాత్రికులు వచ్చే అవకాశం ఉన్న ఈ సమయంలోనే గోదావరి నది రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. రామమందిరం , శివ మందిరం వారానికి వేలాది మంది భక్తులను ఆకర్షిస్తాయి. అందువల్ల ప్రసాద్ పథకం కింద నిధులు సమకూర్చాల్సిన అవసరం ఉంది అని రాజ్యసభలో వివరించినట్టు ఆయన తెలిపారు.
పోచంపాడ్ పుష్కరాల నిర్వహణ కోసం కేంద్రమంత్రికి లేఖ రాసిన ఎంపీ సురేష్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES