Saturday, October 4, 2025
E-PAPER
Homeజిల్లాలుకామారెడ్డి బస్టాండ్ లో ప్రజలకు పోలీసుల అవగాహన

కామారెడ్డి బస్టాండ్ లో ప్రజలకు పోలీసుల అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి 
కామారెడ్డి జిల్లా సూపరిండెంట్  ఆఫ్ పోలీస్ యం.రాజేష్ చంద్ర ఆదేశానుసారం కామారెడ్డి జిల్లా పోలీస్ కళాబృందంచే అవగాహనా  కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సైబర్ నేరాలపై  టోల్ ఫ్రీ నెంబర్.1930 ఫోన్ చేయాలని, కామారెడ్డి షి టీమ్స్ సభ్యులు మహిళా కానిస్టేబుల్ సౌజన్య కానిస్టేబుల్, భూమయ్య, భాను లు అవగాహన కల్పించారు. షి టీమ్స్ నెంబర్.8712686094 అత్యవసర సమయంలో  100 కు కాల్ చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ,  డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ఫోన్ డ్రైవింగ్, మాదకద్రవ్యాలు గంజాయి, డ్రగ్స్ సేవించి యువత పెడదారి పడుతున్నారని, వీటికి దూరంగా ఉండాలన్నారు. మహిళలు, చిన్న పిల్లలపై జరుగు హత్య నేరాలు, బాల్య వివాహాలు, చిన్న పిల్లలపై జరిగే లైంగిక నేరాలపట్ల సేల్ ఫోన్స్, యూట్యూబ్, ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్, సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలన్నారు. పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్, రామంచ తిరుపతి, యు.శేషారావు కానిస్టేబుల్ ప్రభాకర్, సాయిలు, పాటలు, మాటలతో ప్రయాణికులకు అర్థమయ్యే విధంగా వివరించి కార్యక్రమం  నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -