Saturday, October 4, 2025
E-PAPER
Homeజాతీయంకోచింగ్ సెంట‌ర్‌లో పేలుడు..ఇద్దరు మృతి

కోచింగ్ సెంట‌ర్‌లో పేలుడు..ఇద్దరు మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఉత్తరప్రదేశ్‌ లోని ఫరూఖాబాద్‌లోని ఓ కోచింగ్ సెంట‌ర్లో శనివారం భారీ పేలుడు సంభ‌వించింది. పేలుడు ధాటికి ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మూడు ఫైర్ ఇంజ‌న్లు, అంబెలెన్స్ హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నాయి. క్షతగాత్రులను లోహియా జిల్లా ఆసుపత్రికి తరలించారు. ‘ది సన్ క్లాసెస్ లైబ్రరీ’ కోచింగ్ సెంటర్ గ్రౌండ్ ఫ్లోర్‌లో పేలుడు సంభవించింది. పేలుడులో పలువురు పిల్లలు గాయపడ్డారు. ఐదుగురు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా వారిలో ఒకరి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. పేలుడు ఘటన తెలిసిన వెంటనే భారీగా పోలీసు బలగాలను ఆ ప్రాంతంలో మోహరించారు. పేలుడుకు కారణాలపై విచారణ జరుపుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -