- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: డార్జిలింగ్ జిల్లా జస్బీర్ బస్తీలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 14 మంది మరణించారు. దూదియా వద్ద బాలసోన్ నదిపై ఇనుప వంతెన కూలిపోవడంతో సిలుగుడి-మరిక్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియలు విరిగిపడటంతో సిక్కిం-సిలిగుడి మార్గం కూడా మూసుకుపోయింది. కుంభవృష్టి కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. తీస్తా, మాల్ పర్వత ప్రాంత నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. భూటాన్‌లో భారీ వర్షాల వల్ల బంగాల్‌కు ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉంది.
- Advertisement -