Sunday, October 5, 2025
E-PAPER
Homeఆటలుధోనీ నాయకత్వంలో ఒక్క మ్యాచ్ ఆడలేకపోయా: సూర్యకుమార్

ధోనీ నాయకత్వంలో ఒక్క మ్యాచ్ ఆడలేకపోయా: సూర్యకుమార్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: టీమిండియా స్టార్ బ్యాటర్, ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన కెరీర్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. ఎందరో దిగ్గజాల సారథ్యంలో ఆడినప్పటికీ, ఒక విషయంలో మాత్రం తనకు తీరని లోటు ఉందని మనసులో మాట బయటపెట్టాడు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోవడంపై తన ఆవేదన వ్యక్తం చేశాడు.

“ధోనీ భారత జట్టు సారథిగా ఉన్నప్పుడు, అతడి కెప్టెన్సీలో ఒక్క మ్యాచ్ అయినా ఆడాలని నేను బలంగా కోరుకునేవాడిని. కానీ, ఆ అవకాశం నాకు రాలేదు” అని సూర్య తెలిపాడు. ఐపీఎల్‌లో ప్రత్యర్థులుగా ఆడినప్పుడు కూడా, ధోనీ ప్రశాంతత చూసి ఆశ్చర్యపోయేవాడినని చెప్పాడు. “స్టంప్స్ వెనుక అంత ఒత్తిడిలోనూ అతడు ఎంతో కూల్‌గా ఉండేవాడు. ఆ ఒత్తిడిని జయిస్తూ ప్రశాంతంగా ఎలా ఉండాలో ధోనీ నుంచే నేర్చుకున్నాను” అని సూర్య వివరించాడు.

ఇక విరాట్ కోహ్లీ కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ, అతడి సారథ్యంలోనే తాను అంతర్జాతీయ అరంగేట్రం చేశానని గుర్తుచేసుకున్నాడు. “కోహ్లీ ఒక ‘టాస్క్ మాస్టర్’. ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టడానికి కఠినమైన లక్ష్యాలు నిర్దేశిస్తాడు. మైదానంలోనూ, బయట కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటూ మిగతా కెప్టెన్లకు భిన్నంగా కనిపిస్తాడు” అని కొనియాడాడు.

అదే సమయంలో, తాను ఎక్కువగా ఆడింది మాత్రం రోహిత్ శర్మ నాయకత్వంలోనే అని సూర్య పేర్కొన్నాడు. “భారత జట్టుతో పాటు ఐపీఎల్‌లోనూ రోహిత్ కెప్టెన్సీలో ఆడాను. తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ సౌకర్యంగా ఉంచేందుకు రోహిత్ ప్రయత్నిస్తాడు. ముఖ్యంగా యువ ఆటగాళ్లకు 24/7 అందుబాటులో ఉంటూ అండగా నిలుస్తాడు” అని సూర్య ప్రశంసించాడు. రో

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -