‘#సింగిల్’ సినిమా కథ విన్నప్పుడే చాలా హిలేరియస్‌గా అనిపించింది. సినిమాని థియేటర్స్‌లో ప్రేక్షకులు బాగా ఎంజారు చేస్తున్నారు. నిజంగా నా సినిమాని నేను స్క్రీన్ మీద చూసుకోలేను. కానీ ఈ సినిమాని థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి చూసినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ నాకు చాలా ఆనందం ఇచ్చింది’ అని వెన్నెలకిషోర్ అన్నారు.
శ్రీవిష్ణు, కేతిక శర్మ, ఇవానా నాయకానాయికలుగా, వెన్నెలకిషోర్ కీలక పాత్ర పోషించిన చిత్రం ‘ # సింగిల్’. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహిం చారు. గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు. ఈనెల 9న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అందరినీ అలరించి, సమ్మర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
ఈ సందర్భంగా వెన్నెల కిషోర్ మీడియాతో మాట్లాడుతూ,’ఈ సినిమాలో నా క్యారెక్టర్‌కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ హీరో నేనే అనే రివ్యూస్ కూడా వచ్చాయి. గీతా ఆర్ట్స్‌లో ఇటువంటి క్యారెక్టర్‌ని చేయటం చాలా హ్యాపీగా ఉంది. నేను తప్పితే మరో ఆప్షన్ లేదని డైరెక్టర్ చెప్పడం చాలా ఆనందంగా అనిపించింది. శ్రీ విష్ణు చాలా స్పాంటేనియస్‌గా డైలాగ్స్‌ని ఇంప్రవైజ్ చేసేస్తారు. దానికి పక్కన అంతే స్పాంటేనియస్‌గా రియాక్షన్ ఇచ్చే యాక్టర్ ఉండాలి. అలాంటి స్పాంటేనియస్ క్యారెక్టర్‌కి నేనైతే కరెక్ట్ అని డైరెక్టర్ భావించారు. అందుకే శ్రీ విష్ణు ఉండే ఫ్రేమ్‌లో వెన్నెల కిషోర్ ఉండాలని ఆయన ముందే ఫిక్స్ అయ్యారు. ఇప్పుడున్న కాలంలో కామెడీ పండించడం చాలా ఛాలెంజ్. ఇప్పుడు కంటెంట్ విపరీతంగా అన్ని ఫ్లాట్‌ఫామ్స్‌లోనూ ఉంది. రీల్స్ ఓపెన్ చేస్తేనే బోలెడు కామెడీ వీడియోలు కనిపిస్తాయి. థియేటర్స్‌కి వచ్చి ప్రేక్షకులు ఎంజారు చేయాలంటే అంతకుమించి ఇవ్వగలగాలి. అలాంటి క్యారెక్టర్ కుదరాలి. అవన్నీ కుదరడం వెరీ బిగ్ ఛాలెంజ్’ అని చెప్పారు.
అంతకుమించి ఉండాలి
- Advertisement -
- Advertisement -