- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈ డిసెంబర్‌తో రెండేళ్లు కానున్న నేపథ్యంలో మరిన్ని ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2 నెలల్లో 25వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు సమాచారం. పోలీస్ శాఖలో 17వేల పోస్టులున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. వాటితో పాటు టీచర్, డిప్యూటీ DEO, డైట్, BEd కాలేజీల్లో లెక్చరర్లు, SERTలో ఖాళీలు నింపాలని TGPSC సన్నాహాలు చేస్తోంది. గ్రూప్-1,2,3,4 నోటిఫికేషన్లూ రిలీజ్ అయ్యే అవకాశముంది.
- Advertisement -