Monday, October 6, 2025
E-PAPER
Homeజాతీయంబీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

బీసీ రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9పై స్టే ఇవ్వాలన్న పిటిషన్‌‌ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. బీసీలకు 42% కేటాయిస్తే ఎస్సీ(15%), ఎస్టీ(10%)తో కలిపి రిజర్వేషన్లు 67%కి చేరుతాయని, ఇది పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 285కి విరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. అటు హైకోర్టులో ఇదే అంశంపై ఎల్లుండి విచారణ జరగనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -