- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఎవరెస్టుపై మంచు తుపాను సంభవించడంతో 1000 మంది పర్వతారోహకులు చిక్కుకుపోయారు. పర్వతం తూర్పువైపు క్యాంప్‌సైట్ల వద్ద చిక్కుకున్న వారిని కాపాడేందుకు అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఇప్పటివరకు 350 మందిని కాపాడినట్లు సమాచారం. చైనాలో సెలవు దినాలు కావడంతో ఎక్కువ మంది పర్వతారోహకులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక్కడి వాతావరణం కఠినంగా, చాలా చల్లగా ఉంటుందని.. హైపోథెర్మియా బారిన పడే అవకాశముందని ఓ ట్రెక్కింగ్ టీమ్ సభ్యుడు తెలిపారు. తుపాను అకస్మాత్తుగా సంభవించిందని మరొకరు పేర్కొన్నారు.
- Advertisement -