- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: దసరా పండుగ సెలవులు ముగియడంతో ప్రజలు హైదరాబాద్ తిరిగి చేరుకుంటున్నారు. దీంతో ఎల్బీనగర్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎంతకూ వాహనాలు కదలక పోవడంతో జనం మెట్రో రైలును ఆశ్రయించారు. దీంతో ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వద్ద ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. ఈ క్రమంలో మెట్రో సిబ్బంది ప్రయాణికులను క్యూ పద్ధతిలో పంపిస్తున్నారు. ఆఫీసులు, వివిధ పనుల నిమిత్తం వెళ్లేవారు పెద్ద సంఖ్యలో ఉండటంతో కీలోమీటర్ మేర క్యూలైన్‌లో నిల్చున్నారు. క్యూలైన్ నుంచి ఫ్లాట్‌ఫారం వద్దకు చేరేందుకు సుమారు రెండు గంటల సమయం పడుతున్నది.
- Advertisement -