- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: వాతావరణ ఉద్యమ నేత సోనమ్ వాంగ్‌చుక్ అరెస్టును సవాల్ చేస్తూ ఆయన భార్య గీతాంజలి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లద్దాఖ్ రాష్ట్ర హోదా డిమాండ్ నేపథ్యంలో జరిగిన ఆందోళనల్లో హింస చెలరేగడంతో వాంగ్‌చుక్‌ను జోధ్‌పూర్ జైలుకు తరలించారు. తన భర్తను సంప్రదించలేకపోతున్నానని గీతాంజలి ఆరోపించారు. వాంగ్‌చుక్ నిర్బంధానికి గల కారణాలను కుటుంబానికి ఎందుకు తెలియజేయలేదని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించి, కేంద్రం, జమ్ము కశ్మీర్, రాజస్థాన్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. విచారణను అక్టోబర్ 14కు వాయిదా వేసింది.
- Advertisement -