- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : సుప్రీంకోర్టులో సీజేఐ బిఆర్ గవాయ్‌పై ఓ లాయర్ దాడికి యత్నించారు. కేసు విచారిస్తుండగా డయాస్ వద్దకు వెళ్లి షూ తీసి ఆయనపై విసిరేందుకు ప్రయత్నించారు. భద్రతా సిబ్బంది వెంటనే అడ్డుకొని ఆయనను బయటికి లాక్కెళ్లారు. ఈక్రమంలో ఆయన ‘సనాతన ధర్మాన్ని కించపరిచేవారిని వదిలిపెట్టం’ అని బిగ్గరగా అరిచారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ ‘మిగతా లాయర్లు తమ వాదనలు వినిపించండి. ఇలాంటివి నన్ను ప్రభావితం చేయవు’ అని వ్యాఖ్యానించారు.
- Advertisement -