Tuesday, October 7, 2025
E-PAPER
Homeజాతీయంరెండు దశల్లో బిహార్ ఎన్నికలు

రెండు దశల్లో బిహార్ ఎన్నికలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్‌ కుమార్‌ సోమవారం వివరాలు వెల్లడించారు. రెండు దశల్లో పోలింగ్‌ బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. నవంబర్‌ 6న తొలి విడత, నవంబర్‌ 11న రెండో విడత పోలింగ్‌ జరుగుతుందని సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ వెల్లడించారు. నవంబర్‌ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. బిహార్‌లో మొత్తంగా 7.43 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 90,712 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌లోనూ వెబ్‌క్యాస్టింగ్‌ ఉంటుందన్నారు. 243 స్థానాలు ఉన్న బిహార్‌ అసెంబ్లీ గడువు నవంబర్‌ 22తో ముగియనున్న విషయం తెలిసిందే.

243 స్థానాలు ఉన్న బీహార్ రాష్ట్ర అసెంబ్లీకి 2020లో మూడు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించారు. స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్ చేప‌ట్టిన త‌ర్వాత జ‌రుగుతున్న‌తొలి ఎన్నిక‌లు ఇవే. SIRలో భాగంగా బీహార్‌లో 68.5 ల‌క్ష‌ల ఓట‌ర్ల‌ను తొల‌గించారు. 21. 5 ల‌క్ష‌ల మంది కొత్త ఓట‌ర్ల పేర్ల‌ను జాబితాలో క‌లిపారు. బీహార్‌లో మొత్తం 7.42 కోట్ల మంది ఓట‌ర్లు ఉన్న‌ట్లు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. 7.43 కోట్ల మంది బీహారీ ఓట‌ర్ల‌లో .. 3.92 కోట్ల మంది పురుష‌, 3.51 కోట్ల మంది మ‌హిళా ఓటర్లు ఉన్న‌ట్లు సీఈసీ తెలిపారు. ఫ‌స్ట్ టైం ఓట‌ర్లు 14 ల‌క్ష‌లు ఉన్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -