నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కుల పరంగా వ్యాఖ్యలు చేశారు. బ్రాహ్మణులు సమాజంలో జ్ఞాన జ్వాలను వెలిగిస్తారని అన్నారు. గ్రంథాలు, ఆయుధాల ద్వారా మాత్రమే సమాజాన్ని, దేశాన్ని మనం రక్షించగలం అని వ్యాఖ్యానించారు. ఆదివారం ఢిల్లీలోని పితంపురాలో బ్రాహ్మణ సభ ఆధ్వర్యంలో అఖిల భారత బ్రాహ్మణ సమావేశం జరిగింది. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ‘సమాజంలో ఎవరైనా జ్ఞాన జ్వాలను వెలిగిస్తున్నారంటే అది మన బ్రాహ్మణ సమాజమే. వారు గ్రంథాలను మాత్రమే కాకుండా ఆయుధాలను కూడా పూజిస్తారు. ఆయుధాలు, గ్రంథాల ద్వారా మాత్రమే మనం నేడు సమాజాన్ని, దేశాన్ని రక్షించగలం’ అని అన్నారు. అయితే సీఎం స్థాయిలో ఉన్న ఆమె ఒక కులాన్ని ఉన్నతంగా పేర్కొంటూ చేసిన ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి.
బ్రాహ్మణులపై ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రశంసలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES