- Advertisement -
జిల్లా వైద్యాధికారి మధుసూదన్ రావు..
నవతెలంగాణ – మల్హర్ రావు
వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలని భూపాలపల్లి జిల్లా వైద్యాధికారి మధుసూదన్ రావు సూచించారు. సోమవారం మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి, సిబ్బంది రోజువారీ హాజరు రిజిష్టర్,రికార్డులు తనిఖీ చేశారు. ఆస్పత్రి అపరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య సేవలు అందుతున్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. సమయపాలన పాటించని,విధులకు డుమ్మా కొడుతున్న వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి వినయ్ భాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -