Monday, October 6, 2025
E-PAPER
Homeజిల్లాలుసర్కిల్ టోర్నమెంట్ విజేత ఉప్లూర్

సర్కిల్ టోర్నమెంట్ విజేత ఉప్లూర్

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని ఉప్లూర్ లో నిర్వహించిన సర్కిల్ టోర్నమెంట్ విజేతగా ఉప్లూర్ జట్టు నిలిచింది. గ్రామానికి చెందిన యువకులు యునైటెడ్ ఉప్లూర్ పేరుతో ఈ సర్కిల్ టోర్నమెంట్ను నిర్వహించారు. ఐదు రోజులపాటు జరిగిన ఈ పోటీల్లో మొత్తం 26 జట్లు పాల్గొన్నాయి. సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఉప్లూర్, ఏర్గట్ల మండలం బట్టాపూర్ జట్లు తలపడగా ఉప్లూర్ జట్టు విజేతగా నిలిచింది. అనంతరం నిర్వహించిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్, ఆర్మూర్ కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సరసం చిన్నారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని విజేత జట్లకు బహుమతులను అందజేశారు.

విన్నర్ జట్టుకు ట్రోఫీతో పాటు రూ.12వేల నగదు, జట్టు సభ్యులకు మెడల్స్ ను అందజేశారు. రన్నర్ జట్టుకు ట్రోఫీతో పాటు రూ.6వేల నగదును అందజేశారు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్, ఉత్తమ బౌలర్ అవార్డును ఉప్లూర్ జట్టు సభ్యుడు తక్కురి అజయ్ గెలుచుకోగా, ఉత్తమ బ్యాటర్ అవార్డును బట్టాపూర్  జట్టు సభ్యుడు రాహుల్ గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా టీపీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్ మాట్లాడుతూ గ్రామానికి చెందిన యువకులు యునైటెడ్ ఉప్లూర్ పేరుతో సర్కిల్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడల వల్ల శారీరక దారుణ్యంతోపాటు స్నేహభావం పెంపొందుతుంది అన్నారు.

ఆరోగ్యాన్నిచ్చే క్రీడల పై దృష్టి పెట్టడం ద్వారా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. సర్కిల్ టోర్నమెంట్ నిర్వహణకు ఆర్థిక చేయుతనందించిన రేగుంట దేవేందర్, బద్దం  చిన్నారెడ్డి, సరసం చిన్నారెడ్డి, కొమ్ముల రవీందర్, బద్దం రమేష్ రెడ్డి, ఎనేడ్ల ప్రసాద్, బోనగిరి లక్ష్మణ్, కొమ్ముల జీవన్, బోనగిరి భాస్కర్ లకు యునైటెడ్ ఉప్లూర్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో సునీల్ యువసేన నాయకులు ఆ వారి సత్యం, బోనగిరి లక్ష్మణ్, యునైటెడ్ ఉప్లూర్ సభ్యులు ఓం రెడ్డి, అభినయ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -