Monday, October 6, 2025
E-PAPER
Homeఆదిలాబాద్రైతుకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే రామారావు పటేల్

రైతుకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే రామారావు పటేల్

- Advertisement -

నవతెలంగాణ -ముధోల్ 
రైతులకు అండగా ఉంటామని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. ఆదివారం కురిసిన భారీ వర్షం కు ముధోల్ లో తడిసిన సోయపంటను సోమవారం పరిశీలించారు. సోయా దిగుబడులు కోసి కల్లంలో అరబెట్టగా ,బారి వర్షంకు తడిసిపోయి  నష్టం జరగడం దురదృష్టకరమన్నారు. రైతులు దిగులు చెందకూడదని  రైతుల వెన్నంటి ఉంటాననిచెప్పారు. నష్టపోయిన పంట వివరాలను వ్యవసాయ మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆదుకునేలా భరోసా ఇచ్చారు.సోయా పంట విషయమై అసెంబ్లీలో  లేవనెత్తుతా అని అన్నారు.  ప్రభుత్వం స్పందించి త్వరలోనే సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతులను ఆదుకోవాలని అన్నారు.  తడిసిన ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు.అలాగే పంట నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.ఎమ్మెల్యే వెంట మండల బీజేపీ అధ్యక్షులు కోరి పోతన్న, మాజీ సర్పంచ్,ఎంపిటిసి గంట శ్రీనివాస్,దేవోజీ భూమేష్, నాయకులు ధర్మపురి శ్రీనివాస్, సపటోల్ల పోతన్న,జీవన్, మోహన్ యాదవ్, బత్తినోళ్ల సాయి,బాలు,  పాటు రైతులుతదితరులున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -