Tuesday, October 7, 2025
E-PAPER
Homeజాతీయంలడఖ్‌ కౌన్సిల్‌ ఎన్నికలు వాయిదా?

లడఖ్‌ కౌన్సిల్‌ ఎన్నికలు వాయిదా?

- Advertisement -

శ్రీనగర్‌ : లెహ్‌లో లడఖ్‌ అటానమస్‌ హిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (ఎల్‌ఏహెచ్‌డీసీ) ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. కౌన్సిల్‌ పదవీకాలం నవంబర్‌ 2వ తేదీతో ముగుస్తుంది. లెహ్‌జిల్లాలో ఇటీవల నెలకొన్న అశాంతితో పాటు లడఖ్‌లో చలికాలంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులు ఎన్నికల వాయిదాకు కారణంగా భావిస్తున్నారు. లడఖ్‌లో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. దీనికితోడు ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలను వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌కు వాయిదా వేయవచ్చు. కర్ఫ్యూను క్రమేపీ సడలిస్తున్నా, పరిస్థితి నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటున్నా లెV్‌ాలో వాతావరణం ఇప్పటికీ ఉద్రిక్తంగానే ఉంది.
ఎన్నికల వాయిదాకు కొన్ని పరిపాలనా సంబంధమైన కారణాలు కూడా కన్పిస్తున్నాయి. లడఖ్‌లో కొత్తగా ఐదు జిల్లాలను ఏర్పాటు చేస్తామని, అలాగే లెV్‌ా, కార్గిల్‌ కౌన్సిల్స్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని గత సంవత్సరం ఆగస్టులో కేంద్ర హోం శాఖ హామీ ఇచ్చింది. అయితే ఇప్పటికీ అది నెరవేరలేదు. ఈ పరిస్థితుల దృష్ట్యా కౌన్సిల్‌ కాలపరిమితిని మరో ఆరు నెలలు పొడిగించడమో లేదా నవంబర్‌ 2 తర్వాత అధికారాలను డిప్యూటీ కమిషనర్‌కు బదిలీ చేయడమో జరుగుతుంది. దీనిపై చర్చించేందుకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ త్వరలోనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖను సంప్రదించే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -