- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికాలోని కాలిఫోర్నియాలో విమాన ప్రమాదం జరిగింది. సాక్రమెంటోలో ఉన్న హైవేపై హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. సాక్రమెంటో ఫైర్ డిపార్ట్‌మెంట్ సహాయక చర్యలు చేపట్టింది. ఎయిర్ మెడికల్ సర్వీసులు కల్పించే హెలికాప్టర్ గా గుర్తించారు. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణంపై ఇంకా ఏలాంటి కారణాలు తెలియరాలేదు.
- Advertisement -