Tuesday, October 7, 2025
E-PAPER
Homeతాజా వార్తలుజూబ్లీహిల్స్ బైపోల్: రాజ‌కీయ పార్టీల‌తో సి.సుదర్శన్ రెడ్డి భేటీ

జూబ్లీహిల్స్ బైపోల్: రాజ‌కీయ పార్టీల‌తో సి.సుదర్శన్ రెడ్డి భేటీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు దేశంలోని ప‌లు స్థానాల‌కు బైపోల్ ఎల‌క్ష‌న్స్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు కేంద్ర ఎన్నిక‌ల సంఘం వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. వ‌చ్చే నెల న‌వంబ‌ర్ 11న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఈక్ర‌మంలో తాజాగా ముఖ్య ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ, మజ్లిస్ సహా పలు పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.

రానున్న ఉప ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన నూతన సంస్కరణలతో నిర్వహించనున్నట్లు సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సంస్కరణలు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో, అలాగే దేశవ్యాప్తంగా జరగనున్న 8 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు. అన్ని పార్టీలు సహకరించాలని, మార్గదర్శకాలను పాటించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -