మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలు ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలనే డిమాండ్ తో ఈ నెల 9న ఛలో బస్ భవన్ నిర్వహిస్తు న్నట్టు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం హైదరా బాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రయాణి కులు, ప్రజలందరినీ కలుపుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పార్టీ నిర్ణయించినట్టు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమంటూ వారి కుటుంబ సభ్యులకు బస్సు చార్జీలు పెంచడం సరి కాదన్నారు. పెరిగిన బస్సు చార్జీలు సామాన్యులకు పెనుభారంగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ సంస్థను క్రమక్రమంగా ప్రభుత్వం ప్రయివేటీకరిస్తున్నదనీ, ఆ సంస్థను కాపాడేందుకు బీఆర్‌ఎస్ వినూత్న కార్యక్రమాలను చేయనున్నదని తెలిపారు. ఛలో బస్‌భవన్‌లో కార్యక్రమంలో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి తదితర నాయకులు హైదరాబాద్‌లో వివిధ రూట్లలో ప్రయాణించి బస్‌భవన్‌కు చేరుకుని ఆర్టీసీ ఎండీకి వినతిపత్రం సమర్పిస్తారని తెలిపారు.
రేపు చలో బస్‌భవన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES